ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ నమాజును తక్బీర్ ద్వారా, మరియు ఖిరాత్ పఠనాన్ని ‘అల్హందులిల్లాహి రబ్బీల్ ఆలమీన్’ ద్వారా ప్రారంభించేవారు
Choose an available translation of this Hadeeth
Hadeeth text
విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ నమాజును తక్బీర్ ద్వారా, మరియు ఖిరాత్ పఠనాన్ని ‘అల్హందులిల్లాహి రబ్బీల్ ఆలమీన్’ ద్వారా ప్రారంభించేవారు, రుకూ చేసేటప్పుడు తలను మరీ క్రిందికి మరీ పైకి కాకుండా (వీపుకు) సమానంగా ఉంచేవారు, రుకూ నుండి లేచిన తరువాత స్థిరంగా నిలబడనంత వరకు సజ్దాలోకి వెళ్ళేవారు కాదు, సజ్దా నుండి తల లేపి సక్రమంగా కూర్చోనంత వరకు మరో సజ్దా చేసేవారు కాదు, ప్రతీ రెండు రకాతులలో ‘అత్తహియ్యాత్’ చదివేవారు, ఎడమ కాలును పరచి కుడికాలు నిలబెట్టి కూర్చునేవారు, షైతాన్ మాదిరి కూర్చోవడాన్ని వారించేవారు, జంతువుల వలె రెండు చేతులను నేలపై చాచి పెట్టడాన్ని వారించేవారు, చివరగా తన నమాజును సలాం చేస్తూ ముగించేవారు.
Explanation
Benefits
నమాజు యొక్క పలుకులు మరియు ఆచరణలకు విరుద్ధమైన ప్రతి మాటను మరియు పనిని నిషేధించే తక్బీరె తహ్రిమా తప్పనిసరి, మరియు నమాజులో ప్రవేశించడానికి ఈ పద్ధతి కాకుండా వేరే పద్ధతి సరిపోదు.
సూరతుల్ ఫాతిహా పఠనం తప్పనిసరి (వాజిబు).
రుకూ విధిగా చేయటం మరియు దానిలో శ్రేష్టమైనది తల పైకి ఎత్తడం, క్రిందికి దించడం కాకుండా నడుముకు సమానంగా ఉంచడం గురించి తెలుస్తున్నది.
రుకూ నుండి పైకి లేవటం, మరియు ఆ తర్వాత నిలబడటంలో నిటారుగా, స్థిరంగా ఉండటం తప్పనిసరి అని తెలుస్తున్నది.
సజ్దా ఆచరించుట, దాని నుండి లేచుట మరియు దాని తర్వాత నిటారుగా కూర్చొనుట తప్పనిసరి.
నమాజులో కూర్చున్నప్పుడు ఎడమ కాలును పరుచుకొని దానిపై కూర్చోవడం మరియు కుడి కాలును నిలబెట్టడం (ఇఫ్తీరాష్) ధర్మబద్ధమైనది. అయితే, మగ్రిబ్ మరియు ఇషా వంటి రెండు తషహ్హుదులు గల నమాజులోని చివరి తషహ్హుదులో తవర్రుక్ చేయడం ధర్మబద్ధమైనది. ఈ విషయం గురించి ఇతర హదీథులు కూడా ఉల్లేఖించబడ్డాయి.
షైతాను కూర్చునే విధానాన్ని అనుకరించడం నిషేధించబడినది, అదెలాగంటే, తన మడమల మీద కూర్చొని, పాదాలను నేలపై పరచడం, లేదా వాటిని నిలబెట్టి, వాటి మధ్య నేలపై కూర్చోవడం.
అడవి మృగంలా నమాజు చేస్తున్న వ్యక్తి తన మోచేతులను నేలపై విస్తరించడం నిషేధం, ఎందుకంటే ఇది బద్దకానికి మరియు బలహీనతకు చిహ్నం.
షైతాను మరియు జంతువుల చేష్టలను అనుకరించడం నిషేధించబడినది.
నమాజును సలాంతో ముగించడం తప్పనిసరి. ఇది నమాజు చేసేవారి, హాజరైన మరియు హాజరుకాని నీతిమంతులైన వారి కొరకు, అన్ని రకాల చెడులు మరియు లోపాల నుండి సంరక్షణ కోసం చేసే దుఆ.
నమాజులో ప్రశాంతత తప్పనిసరి.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

